శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 02:10:03

పైవేటు రైళ్ల రాకపోకలు పక్కాగా ఉండాలి

పైవేటు రైళ్ల రాకపోకలు పక్కాగా ఉండాలి

  • సమయపాలన కచ్చితంగా పాటించాలి
  • పైవేటు రైళ్ల రాకపోకలు పక్కాగా ఉండాలి 
  • రైల్వే విభాగం ముసాయిదాలో వెల్లడి 

న్యూఢిల్లీ, ఆగస్టు 13: త్వరలో ప్రవేశపెట్టబోయే ప్రైవేటు రైళ్లు సమయపాలనను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని రైల్వే విభాగం స్పష్టం చేసింది. నిర్ణీత సమయంకంటే ముందుగా గమ్యం చేరినా లేదా ఆలస్యంగా వచ్చినా భారీగా జరిమానాలు విధిస్తామని బుధవారం విడుదలచేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మేరకు.. ఆదాయాలకు సంబంధించి ప్రైవేటు సంస్థలు తప్పుడు లెక్కలు చూపినట్టు తేలితే కూడా భారీగా అపరాధ రుసుము విధిస్తారు.

 నోటిఫికేషన్‌లోని వివరాలు..

  • నిర్ణీత సమయం కంటే రైలు 15 నిమిషాలు ఆలస్యంగా గమ్యం చేరితే సమయపాలన తప్పినట్టు భావిస్తారు. 
  • రైల్వే ట్రాకులు, స్టేషన్లు తదితర మౌలిక వసతులను వాడుకున్నందుకు ప్రైవేటు సంస్థలు కిలోమీటర్‌కు రూ.512 చొప్పున రైల్వేకు చెల్లించాలి. దీనిని రవాణా చార్జీ అంటారు. 
  • సమయపాలనకు సంబంధించి ఒకశాతం ఉల్లంఘనకు 200కిలోమీటర్ల రవాణా చార్జీని పెనాల్టీగా విధిస్తారు. 
  • రైలు 10 నిమిషాలు ముందుగా గమ్యం చేరితే పది కిలోమీటర్ల పెనాల్టీ వేస్తారు. 
  • సంస్థ ఏదైనా కారణంతో రైలును రద్దు చేస్తే ఆ రైలు నడిపితే వచ్చే ఆదాయంలో నాలుగోవంతు రైల్వేకు చెల్లించాలి. 

తాజావార్తలు


logo