శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 00:25:45

చండీగఢ్‌లో 33% సిబ్బందితో ప్రైవేట్‌ స్కూళ్లు ప్రారంభం

చండీగఢ్‌లో 33% సిబ్బందితో ప్రైవేట్‌ స్కూళ్లు ప్రారంభం

చండీగఢ్‌: సోమవారం నుంచి 33 శాతం మంది సిబ్బందితో పాఠశాలలను నడుపాలని కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చండీగఢ్‌లోని ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ) నిర్ణయించింది. మూడు నెలలకోసారి బదులు నెలవారిగా ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించామని ఐఎస్‌ఏ అధ్యక్షుడు హెచ్‌ఎస్‌ మామిక్‌ తెలిపారు. అయితే, స్కూళ్ల కార్యాలయాలు తెరిచేందుకు అనుమతినిస్తామని, తరగతి గదుల నిర్వహణకు కాదని యూటీ డైరెక్టర్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ (స్కూళ్లు) రుబీందర్‌జిత్‌ సింగ్‌ బ్రార్‌ చెప్పారు. logo