శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 14:17:34

అధిక బిల్లులు వసూలు చేసిన ప్రైవేట్‌ దవాఖాన సీజ్‌

అధిక బిల్లులు వసూలు చేసిన ప్రైవేట్‌ దవాఖాన సీజ్‌

థానే :  రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఓ దవాఖాన లైసెన్సును థానే మున్సిపల్ కార్పొరేషన్ రద్దు చేసింది. ప్రైవేటు దవాఖానాలు కరోనా రోగుల నుంచి అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలపై మున్సిపల్ కార్పొరేషన్ విచారణకు ఆదేశిచింది. అధికారిక ఆడిట్ బృందాలు వివిధ దవాఖానకు సందర్శించి రోగుల బిల్లులను పరిశీలించాయి.  దాదాపు 15 దవాఖానలు రూ. 27 లక్షలు అధికంగా వసూలు చేశాయని ఆడిట్ బృందాలు తేల్చాయి.

ఈ క్రమంలో ఓ దవాఖాన ఏకంగా తన లైసెన్సునే కోల్పోయింది. ఈ తరహాలో అధిక బిల్లులు వసూలు చేసే దవాఖానల భరతం పట్టేందుకు భవిష్యత్తులోనూ మరిన్ని దాడులు చేపడతామని థానే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సందీప్ మాలావీ హెచ్చరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo