మంగళవారం 07 జూలై 2020
National - Jun 05, 2020 , 15:00:46

పెట్స్ కోసం ప్లేన్.. సీటు ఖ‌రీదు ల‌క్షా 60 వేలు

పెట్స్ కోసం ప్లేన్.. సీటు ఖ‌రీదు ల‌క్షా 60 వేలు

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల ఎవ‌రూ ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి.  గ‌త రెండు నెల‌ల నుంచి సాధార‌ణ ప్ర‌యాణాలు లేవు. దీంతో ఎక్క‌డివాళ్లు అక్క‌డే నిలిచిపోయారు. లాక్‌డౌన్ వ‌ల్ల కొంద‌రు త‌మ పెంపుడు జంతువుల‌కు దూరంగా ఉన్నారు. జీవితంలో భాగ‌స్వామిగా భావించే పెట్స్‌కు దూర‌మైన కొంద‌రు.. ఎలాగైనా త‌మ పెంపుడు జంతువుల వ‌ద్ద‌కు చేరుకోవాల‌న్న త‌ప‌న‌తో ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ల కోసం ఓ ప్రైవేటు జెట్ సంస్థ‌.. ప్ర‌త్యేకంగా ఓ ప్లేన్‌ను న‌డుపుతున్న‌ది.  ఢిల్లీ నుంచి ముంబై వ‌ర‌కు కేవ‌లం పెంపుడు జంతువుల కోసం ఆ విమానాన్ని న‌డుపుతున్న‌ట్లు ఔత్సాహిక పారిశ్రామికురాలు దీపికా సింగ్ తెలిపారు. 


అక్రిష‌న్ ఏవియేష‌న్ అనే ప్రైవేటు విమాన సంస్థ ఈ ప్లేన్‌ను న‌డుపుతున్న‌ది.  ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి.  ఒక్కొక్కొ సీటులో ఒక్కొక్క పెంపుడు జంతువును త‌మ ఓన‌ర్ల వ‌ద్దకు చేర్చేందుకు నిర్ణ‌యించారు.  ఆ విమానం కిరాయి ఖ‌రీదు మొత్తం 9 ల‌క్ష‌ల 60 వేలు.  అయితే ఇప్ప‌టికే ఆ విమానంలో నాలుగు సీట్లు బుక్ అయ్యాయి. ఇంకా రెండు సీట్లు ఖాళీ ఉన్న‌ట్లు దీపికా సింగ్ తెలిపారు. జూన్ నెలలో ఈ ప్లేన్‌ను న‌డ‌ప‌నున్నారు. రెండు షిహూ తుజ‌స్, ఓ గోల్డెన్ రిట్రీవ‌ర్ శున‌కాల‌కు సీట్లు బుక్ చేసుకున్నారు. మ‌రో లేడీ ఫిజంట్ ప‌క్షి కోసం కూడా ఓ సీటు బు‌క్కైంది.  ఖాళీ ఉన్న రెండు సీట్లకు ఒక‌వేళ బుకింగ్ పూర్తి కాకుంటే, అప్పుడు విమాన సీటు ఖ‌రీదు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది. logo