ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 07:57:21

బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

బెంగళూరు : ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగడంతో.. ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన కర్ణాటక చిత్రదుర్గా జిల్లా హిరియూరు వద్ద మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి విజయ్‌పుర వెళ్తున్న ప్రయివేటు బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో ఈ మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం అయ్యారు. మ‌రో 27 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్ర‌మాదానికి గురైన బస్సును కుకీ శ్రీ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు.


logo