శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 10:43:20

ఆల్కహాల్‌ అనుకుని శానిటైజర్‌ సేవించిన ఖైదీ

ఆల్కహాల్‌ అనుకుని శానిటైజర్‌ సేవించిన ఖైదీ

తిరువనంతపురం : ఓ రిమాండ్‌ ఖైదీ.. ఆల్కహాల్‌ అనుకుని శానిటైజర్‌ సేవించడంతో మృతి చెందాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్‌ జైలులో గురువారం చోటు చేసుకుంది. రమణ్‌కుట్టి అనే రిమాండ్‌ ఖైదీ పాలక్కడ్‌ జైల్లో ఫిబ్రవరి 18 నుంచి ఉంటున్నాడు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా చేతులను శుభ్రపరుచుకోవడానికి శానిటైజర్‌ను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కేరళ ప్రభుత్వం.. శానిటైజర్‌ను తయారు చేయాలని పాలక్కడ్‌ జైలు అధికారులను ఆదేశించింది. దీంతో ఖైదీలు శానిటైజర్‌ను తయారు చేసే పనిలో పడ్డారు. శానిటైజర్‌ తయారికీ ఉపయోగించే ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను రిమాండ్‌ ఖైదీ రమణ్‌కుట్టి సేవించాడు. కాసేపటికే అతను కుప్పకూలిపోయాడు.పాలక్కడ్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఖైదీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖైదీ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టాయి. ఖైదీ మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కానున్నాయి.


logo