శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 06:07:26

విద్యార్థులకు టాబ్లెట్స్‌ అందించిన ప్రిన్సిపాల్‌..

విద్యార్థులకు టాబ్లెట్స్‌ అందించిన ప్రిన్సిపాల్‌..

భాదొహి: ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. తమ విద్యార్థులకు డిజిటల్‌ విద్యపై పూర్తి అవగాహన రావడానికి, తన జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి 10 టాబ్లెట్స్‌ను కొనుగోలు చేసి, వారికి సమకూర్చాడు. వారణాసి నియోజకవర్గంలోని చితైపూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్‌.. విద్యార్థుల డిజిటల్‌ విద్యకై కావాల్సిన డాబ్లెట్స్‌ను జిల్లా మెజిస్ట్రేట్‌ రాజేంద్ర ప్రసాద్‌తో ఓ కార్యక్రమం ఏర్పాటు చేయించి, ఆయన చేతుల మీదుగా ఇప్పించాడు. కాగా, తమకు టాబ్లెట్స్‌ ఇవ్వడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రిన్సిపల్‌ సర్‌.. నిత్యం మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడని వారన్నారు.

ప్రిన్సిపాల్‌ అరవింద్‌ పాల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న టెక్ట్స్‌బుక్స్‌లో క్యూర్‌ కోడ్స్‌ పొందుపరుస్తున్నారు. వాటిని స్కాన్‌ చేసినైట్లెతే.. కోడ్స్‌ చాప్టర్‌లోని సొల్యూషన్స్‌ని ఈ టాబ్లెట్స్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇలాగే ఇందులో పొందుపర్చిన అప్లికేషన్స్‌ సైతం విద్యార్థులకు హింది, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ మొదలగు భాషలపై పట్టు పెంపొందిస్తాయన్నారు. 


logo