బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 02:18:16

యువరాజు హోదాను వదులుకున్న హ్యారీ

యువరాజు హోదాను వదులుకున్న హ్యారీ

లండన్‌: బ్రిటన్‌ యువరాజు హ్యారీ తనను ఇక నుంచి ప్రిన్స్‌ హ్యారీ అనికాకుండా కేవలం హ్యారీ అని పిలువాలని కోరారు. తన చివరి రాచరిక విధులను నిర్వర్తించడంలో భాగంగా ఎడిన్‌బర్గ్‌లో జరుగుతున్న ట్రావెలిస్ట్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఆయన బ్రిటన్‌కు వచ్చారు. రాచరిక బంధనాలను తెంచుకుని, ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలని హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ దంపతులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి చివరినాటికి వారు అధికారికంగా హోదాలను వదులుకోనున్నారు. అప్పటివరకు ఆ హోదా ఉన్నా తనను పేరుతో మాత్రమే పిలువాలని హ్యారీ చెప్పినట్టు కాన్ఫరెన్స్‌ నిర్వాహకులు తెలిపారు.


logo