బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 23:57:34

జనతా కర్ఫ్యూలో ప్రధాని ‘మాతృమూర్తి’..

జనతా కర్ఫ్యూలో ప్రధాని ‘మాతృమూర్తి’..

గుజరాత్‌: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన.. ’జనతాకర్ఫ్యూ‘ను ఈ రోజు(మార్చి 22) 14 గంటలపాటు పాటించాలని దేశప్రజలకు విన్నవించిన విషయం విదితమే. ప్రధాని పిలుపుకు యావత్‌భారతావని విశేషంగా స్పందించింది. దేశంలోని ప్రతి పౌరుడు తమకు తామే స్వీయనిర్భందం చేసుకొని, ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు దేశానికి సేవ చేస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, మీడియా, విద్యుత్‌ సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలియజేయాలని ప్రధాని సూచించారు. ప్రజలంతా ప్రధాని సూచనలు పాటించి, దేశ మేలును కోరే సిబ్బందికి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ సైతం జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమె తన నివాస ఆవరణలో పల్లెం వాయిస్తూ.. దేశ వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బంది, శానిటైజేషన్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. 


logo
>>>>>>