గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 09:44:25

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేయనున్న ప్రధాని

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేయనున్న ప్రధాని

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించే నిమిత్తం దేశవ్యాప్తంగా 10 వేల రైతు నిర్మాణ సంస్థలను(ఎఫ్‌పీవో) ప్రధాని నేడు ప్రారంభించనున్నారు. అదేవిధంగా బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 1.1 హెక్టార్ల వ్యవసాయ భూమిని కలిగిన చిన్న, సన్నకారు రైతులు దేశంలో 86 శాతం వరకు ఉన్నారు. సరైన గిట్టుబాటు ధర లేక, టెక్నాలజీకి దూరంగా, నాణ్యమైన విత్తనాలు, పురుగులమందులు లభించక, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిని అధిగమిస్తూ అవసరమైన ఆర్థిక సహాయం సైతం అందించేందుకు ఈ ఎఫ్‌పీవోలు సహాయంగా పనిచేయనున్నాయి. పర్యటన సందర్భంగా ప్రధాని పీఎం కిసాన్‌ పథకం లబ్దిదారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేయనున్నారు.


logo
>>>>>>