గురువారం 02 జూలై 2020
National - Jun 30, 2020 , 07:22:24

ఈ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించనున్న ప్ర‌ధాని!

ఈ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించనున్న ప్ర‌ధాని!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ సాయంత్రం 4 గంట‌ల‌కు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. అన్‌లాక్‌-2 కు సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల‌లో జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని, దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, థియేటర్లు కూడా జూలై 31 వ‌ర‌కు మూసే ఉంటాయని హోంశాఖ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ది. రాత్రి 10 గంట‌ల‌ నుంచి ఉదయం 5 గంట‌ల వరకు య‌థావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

ఈ క్రమంలో ప్ర‌ధాని మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి, దాని నిర్మూల‌న‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పైనే ఆయ‌న మాట్లాడే అవకాశం ఉన్న‌ది. దేశ‌వ్యాప్తంగా కరోనా ర‌క్క‌సి క‌రాళ నృత్యం చేస్తున్న నేప‌థ్యంలో ప్రజలకు మరోసారి ప్ర‌ధాని కీలక సూచనలు, స‌ల‌హాలు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా గ‌ల్వాన్‌లో లోయ‌లో భార‌త్‌-చైనా దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ను కూడా ప్ర‌ధాని త‌న‌ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించే అవ‌కాశం ఉన్న‌ది. 


logo