సోమవారం 13 జూలై 2020
National - Feb 07, 2020 , 11:48:08

గౌహతికి చేరుకున్న ప్రధాని మోదీ

గౌహతికి చేరుకున్న ప్రధాని మోదీ

అసోం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు అసోం పర్యటనకు బయల్దేరి వెళ్లారు. గౌహతికి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీష్‌ముఖి, సీఎం సర్బానంద సోనోవాల్‌, మంత్రి హిమంతాబిస్వాతో పాటు పలువురు ఘనస్వాగతం పలికారు. గులాబీ పుష్పాలు అందజేసి శాలువాలతో సత్కరించి ప్రధానికి ఆహ్వానం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని కోక్రాఝర్‌కు బయల్దేరివెళ్లారు. బోడో శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగిన నేపథ్యంలో జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.


logo