సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 10:55:13

సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తి : ప్రధాని మోదీ

సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దేశాన్ని సుస్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరవలేనిది అని మోదీ ట్వీట్‌ చేశారు. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని పేర్కొన్నారు. 

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనియాడారు. దేశ సైనికుల శౌర్యాన్ని స్మరించుకున్నారు. సైనికులు దేశాన్ని కాపాడుతున్న నిజనమైన హీరోలు అని ప్రశంసించారు. జవాన్ల శౌర్య, ప్రరాక్రమాలతోనే కార్గిల్‌ విజయం సాధించామని పేర్కొన్నారు. నేడు దేశం గర్వించదగ్గ రోజు అని అమిత్‌ షా ట్విట్టర్‌లో తెలిపారు. 


logo