శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 13:23:48

ఆరోగ్య వ‌న్ పార్కును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

ఆరోగ్య వ‌న్ పార్కును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప‌లు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈ ఉద‌యం న‌ర్మ‌దా జిల్లాలోని కెవాడియాలో ఆరోగ్య వ‌న్ పార్కును ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డ‌ ఏర్పాటు చేసిన టూరిస్టు వాహ‌నంలో పార్కు అంతటా క‌లియ‌తిరిగారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీతోపాటు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ, ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ్‌వ్ర‌త్ కూడా ఉన్నారు.

కాగా, ఈ ఆరోగ్య వ‌న్ పార్కులో వంద‌లాది ఔష‌ధ మొక్క‌ల‌ను, పొద‌ల‌ను పెంచారు. అంతేగాక వాటి ఉప‌యోగాలు, ప్రాముఖ్య‌త‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని కూడా ఆయా మొక్కలు, పొద‌ల వ‌ద్ద ఏర్పాటు చేసిన బోర్డుల‌లో పొందుప‌ర్చారు. ఓష‌ధీ మొక్క‌లు, పొద‌లు.. వాటి ప్రాముఖ్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియజేయ‌డం కోసం ఈ పార్కును సిద్ధం చేశార‌ని ప్ర‌ధాని చెప్పారు.     


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.