మంగళవారం 31 మార్చి 2020
National - Feb 24, 2020 , 12:59:59

ట్రంప్‌ను హత్తుకున్న మోదీ

ట్రంప్‌ను హత్తుకున్న మోదీ

గుజరాత్‌ : రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. విమానం దిగగానే ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం పలికారు మోదీ. ట్రంప్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రధాని మోదీ. మెలానియా ట్రంప్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత రెడ్‌కార్పెట్‌పై ట్రంప్‌ దంపతులు, మోదీ నడుస్తున్న సమయంలో గుజరాతీ జానపద కళాకారులు అపూర్వ స్వాగతం పలికారు. గతంలో కూడా మోదీ పలు దేశాల అధ్యక్షులను హత్తుకుని వెల్‌కమ్‌ చెప్పారు. ఇతరులకు ఆలింగనంతో స్వాగతం చెప్పడం భారతీయుల ఆనవాయితీ. ఈ ఆనవాయితీని మోదీ కొనసాగిస్తున్నారు. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చిన అధ్యక్షులకైనా.. లేదా మోదీ ఇతర దేశాలకు వెళ్లినా అక్కడి అధ్యక్షులకు ఆలింగనంతో స్వాగతం పలుకుతారు.


logo
>>>>>>