8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం కొత్తగా 8 రైళ్లను ప్రారంభించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కాగా, కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు గుజరాత్‌లోని కెవాడియా పట్టణం నుంచి దేశంలోని ఎనిమిది ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి.
గుజరాత్‌లోని కెవాడియా పట్టణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీకి హోమ్‌టౌన్‌గా ఉన్నది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ.. 2018 అక్టోబర్‌లో పటేల్ భారీ విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతమైన కెవాడియాలో పర్యాటకానికి ఊతమివ్వడానికి, స్టాట్యూ అఫ్ లిబర్టీకి ప్రపంచ నలుమూలల నుంచి కనెక్టివిటీ సదుపాయం కల్పించడానికి కొత్తగా రైళ్లను ప్రారంభించినట్లు ప్రధాని పేర్కొన్నారు.
కాగా, కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు కెవాడియా-వారణాసి, కెవాడియా-దాదర్, కెవాడియా-అహ్మదాబాద్, కెవాడియా-హజ్రత్, కెవాడియా-నిజాముద్దీన్, కెవాడియా-రేవా, కెవాడియా-చెన్నై, కెవాడియా-ప్రతాప్‌నగర్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా