శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 12:15:26

విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

ఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని ఏపీలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనపై సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఎన్డీఎంఏ ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష చేపట్టారు.

తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య...

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ఆర్. ఆర్. వెంకటాపురంలో కాల్వలో పడి ఇద్దరు, బావిలో పడి ఒకరు, కేజీహెచ్ క్యాజువాల్టీలో ముగ్గురు, ఆర్పీ వార్డులో ఇద్దరు, విజయనగరం కొత్తవలస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందాడు.logo