శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 20:38:15

జ‌పాన్ ప్ర‌ధానీకి న‌రేంద్ర మోదీ ఫోన్

 జ‌పాన్ ప్ర‌ధానీకి న‌రేంద్ర మోదీ ఫోన్

ఢిల్లీ : జ‌పాన్ ప్ర‌ధానిగా నియమితులైన సుగా యోశిహిదే కు ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. "సుగా యోశిహిదే త‌న ల‌క్ష్యాల సాధనలో స‌ఫ‌లం కావాలంటూ మోదీ ఆయనకు  శుభాకాంక్షలు చెప్పారు. భారత్, జపాన్ ల మ‌ధ్య ఏర్పడ్డ ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క, ప్ర‌పంచ స్ధాయి భాగ‌స్వామ్యం గ‌త కొన్నేళ్ళ లో ఎంతో పురోగ‌మించింద‌ని నేత‌లిద్ద‌రూ అంగీకరిస్తూ, ప‌ర‌స్ప‌ర విశ్వాసం, ఉమ్మ‌డి విలువ‌ల ద్వారా ఈ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్ట‌ం చేసుకోవాలన్న తమ ఉద్దేశాన్ని వ్య‌క్తం చేశారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి స‌హా ప్ర‌పంచానికి ఎదుర‌వుతున్న స‌వాళ్ళను దృష్టిలో ఉంచుకొంటే, ఇరు దేశాల మ‌ధ్య ఏర్పడిన భాగ‌స్వామ్యం ప్ర‌స్తుతం మ‌రింత బలంగా ఉంద‌ంటూ ఉభ‌య నేతలు ఏకీభవించారు. 

ఆటు పోటుల‌కు త‌ట్టుకొని నిల‌చే స‌ర‌ఫ‌రా వ్యవస్థ అండదండలతో ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో  అర‌మ‌రిక‌ల‌కు తావు లేని, స్వేచ్ఛాయుత‌, స‌మ్మిళిత స్వ‌రూపం క‌లిగిన ఆర్థిక వ్య‌వ‌స్థ ముందుకుసాగాల‌ని వారు స్ప‌ష్టం చేశారు. భార‌త‌దేశాని కి, జ‌పాన్ కు, భావ‌సారూప్యం క‌ల ఇత‌ర దేశాల‌ కు మ‌ధ్య ఇప్పుడు కొనసాగుతున్న స‌హ‌కారాన్ని నేత‌లిద్దరూ స్వాగ‌తించారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి  మెరుగుప‌డ్డ తర్వాత వార్షిక ద్వైపాక్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలుపంచుకోవ‌డానికి భార‌త‌దేశానికి రావలసిందిగా ప్రధాని సుగా యోశిహిదేను న‌రేంద్ర మోదీ ఆహ్వానించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.