బుధవారం 27 జనవరి 2021
National - Dec 19, 2020 , 01:40:46

ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికిప్రధాని మోదీ ఆఫీస్‌

ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికిప్రధాని మోదీ ఆఫీస్‌

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ కార్యాలయాన్ని కొందరు ఆకతాయిలు ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. జవహర్‌నగర్‌లో ఉన్న ఈ కార్యాలయాన్ని ఫొటో తీసిన నిందితులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు దానికి ట్యాగ్‌ తగిలించి ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.


logo