మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 03, 2020 , 18:48:09

ఇప్పటివరకు రూ.103 కోట్ల విరాళాలిచ్చిన మోదీ

 ఇప్పటివరకు రూ.103 కోట్ల విరాళాలిచ్చిన మోదీ

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటివరకు రూ.103 కోట్లకు పైగా వివిధ కార్యక్రమాలు, పనుల కోసం విరాళాలిచ్చారు. వీటిలో వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు అతడి వ్యక్తిగత పొదుపు డబ్బు ఉన్నట్లు సమాచారం.

పీఎం-కేర్స్ ఫండ్ ప్రారంభ కార్పస్ కోసం మోదీ రూ.2.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, క్లీన్ గంగా మిషన్, నిరుపేదల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టులకు నిధులు అందజేసి సహకరించారు. కుంభమేళా పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం 2019 లో తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ.21 లక్షలను కార్పస్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారని మోదీ దగ్గర వ్యక్తి ఒకరు తెలిపారు. గతేడాది దక్షిణ కొరియాలో సియోల్ శాంతి బహుమతిని అందుకున్న వెంటనే.. గంగా నదిని శుభ్రపరచడంలో సహాయపడటానికి బహుమతి మొత్తం రూ.1.3 కోట్లను నమామి గంగే ప్రాజెక్టు వైపు వెళ్తుందని ప్రకటించారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అందుకున్న మెమెంటోలను వేలం వేయడం ద్వారా రూ .3.40 కోట్లు వసూలైన మొత్తాన్ని కూడా నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చారు. అలాగే కొంతకాలం క్రితం మోదీ అందుకున్న బహుమతుల రూపంలో పొందిన రూ.8.35 కోట్ల మొత్తాన్ని కూడా మళ్ళీ నమామి గంగే మిషన్ కోసం కేటాయించారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కుమార్తెలకు విద్యనభ్యసించడానికి మోదీ తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా తనకు లభించిన బహుమతులన్నింటినీ వేలం వేయగా వచ్చిన రూ.89.96 కోట్ల డబ్బును కన్యా కేళవని నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల చదువు కోసం డబ్బు ఖర్చు చేశారు.