మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 12:10:39

రేపు చ‌రిత్రాత్మ‌క కోసి రైల్ మెగా బ్రిడ్జి ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రేపు చ‌రిత్రాత్మ‌క కోసి రైల్ మెగా బ్రిడ్జి ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఢిల్లీ : చ‌రిత్రాత్మ‌క కోసి రైల్ మ‌హాసేతు (మెగా బ్రిడ్జి)ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేయ‌నున్నారు. బీహార్ రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా ప్ర‌యాణికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి 12 రైలు ప్రాజెక్టుల‌నుఆయన ప్రారంభించ‌నున్నారు. వీటిలో కియుల్ న‌దిపై కొత్త రైల్వే బ్రిడ్జి, రెండు కొత్త రైల్వే లైన్లు, ఐదువిద్యుదీక‌ర‌ణ ప్రాజెక్టులు, ఒక ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్ షెడ్‌, బ‌ర్హ్-భ‌క్తియార్‌పూర్ మ‌ధ్య మూడో లైను ప్రాజెక్టు ఉన్నాయి. కోసి రైల్ మ‌హాసేతును జాతికి అంకితం చేయ‌డం బీహార్ చ‌రిత్ర‌లో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవ‌చ్చు. దీంతో ఈప్రాంతం మొత్తం ఈశాన్య రాష్ట్రాల‌తో అనుసంధానం అవుతుంది.

1887లో నిర్మాలి , భాప్టాహి (స‌రియాఘ‌డ్‌) మ‌ధ్య మీట‌ర్‌గేజ్ లింక్ నిర్మించారు. భారీ వ‌ర‌ద‌లు1934లో సంభ‌వించిన భార‌త నేపాల్ భూకంపం కార‌ణంగా ఈ రైలు వ్య‌వ‌స్థ కొట్టుకు పోయింది. కోసి న‌ది  ప్ర‌వాహం‌ కార‌ణంగా ఈ రైలు లింక్‌ను పున‌రుద్ధ‌రించేందుకు చాలా కాలం ఎలాంటి ప్ర‌య‌త్నాలూ జ‌ర‌గ‌లేదు. 2003-2004 సంవ‌త్స‌రంలో కోసి మెగా బ్రిడ్జిలైన్ ప్రాజెక్టును భార‌త ప్ర‌భుత్వం మంజూరు చేసింది. కోసి రైల్ మ‌హాసేతు పొడ‌వు 1.9 కిలోమీట‌ర్లు. దీని నిర్మాణ వ్య‌యం రూ. 516 కోట్ల. ఇండియా- నేపాల్ స‌రిహ‌ద్దులొ ఈ బ్రిడ్జి వ్యూహాత్మ‌కంగా ఎంతో కీల‌క‌మైన‌ది. ఈ ప్రాజెక్టు కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో పూర్తి అయింది. వ‌ల‌స కార్మికులు కూడా ఈ ప్రాజెక్టు ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయ‌డంతో ఈ ప్రాంత ప్ర‌జ‌ల 86 ఏండ్ల సుదీర్ఘ‌కాల క‌ల నెర‌వేర‌నున్నది. మ‌హాసేతు ను జాతికి అంకితం చేయ‌డంతోపాటు ప్ర‌ధాన‌మంత్రి, సుపౌల్ స్టేష‌న్ నుంచి స‌హ‌స్ర‌- అస‌న్‌పూర్ కుఫాకు డెమో రైలును జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. ఒక‌సారి రెగ్యుల‌ర్ రైలు స‌ర్వీసులు ప్రారంభ‌మైతే, ఇది సుపౌల్‌,అరారియా, స‌హ‌ర్స జిల్లాల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌నుంది. కోల్‌క‌తా, ఢిల్లీ, ముంబాయి వంటి సుదూర ప్రాంతాల‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌లు చేరుకోవ‌డానికి ఇది ఎంతో సుల‌భ మార్గం కానుంది.

ప్రధాన‌మంత్రి హౄజిపూర్ -ఘోస్వార్‌-వైశాలి, అలాగే ఇస్లాంపూర్‌- న‌టేశ‌ర్ ల‌కు ర ఎండు కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్నారు. అలాగే క‌ర్ణౌతి- భ‌క్తియార్‌పూర్ లింక్ బైపాస్‌, బ‌ర్హా-భ‌క్తియార్‌పూర్ మ‌ధ్య మూడ‌వ లైనును ప్ర‌ధానమంత్రి ప్రారంభించ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముజ‌ఫ‌ర్‌పూర్‌- సీతామ‌ర్హి, క‌థిహార్‌- న్యూజ‌ల్పాయ్‌గురి, స‌మ‌స్తిపూర్ -ద‌ర్భంగా-జ‌య‌న‌గ‌ర్‌, స‌మ‌స్థిపూర్‌-ఖ‌గారియా, భ‌గ‌ల్పూర్ - శివ‌నారాయ‌ణ్‌పూర్ సెక్ష‌న్ల రైల్వే విద్యుదీక‌ర‌ణ ప్రాజెక్టుల‌నుకూడా ప్రారంభించ‌నున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo