ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 15:32:20

‘ఇండియా ఐడియాజ్ సమిట్’ లో కీలకోపన్యాసమివ్వనున్న ప్రధాన మంత్రి మోదీ

 ‘ఇండియా ఐడియాజ్ సమిట్’ లో కీలకోపన్యాసమివ్వనున్న ప్రధాన మంత్రి మోదీ

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే ‘ఇండియా ఐడియాజ్ సమిట్’ లో కీలకోపన్యాసం చేయనున్నారు. యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్  ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నది.  ఈ సంవత్సరం కౌన్సిల్ 45 వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ‘మెరుగైన భవిష్యత్తు ను నిర్మించడం’ అనే థీమ్ తో ఇండియా ఐడియాజ్ సమిట్లో పలు అంశాలపై చర్చించనున్నారు.

వర్చువల్ మాధ్యమం లో జరిగే ఈ సమావేశానికి భారత ప్రభుత్వం లోని, యుఎస్ ప్రభుత్వం లోని విధాన రూపకర్తలు, రాష్ట్ర స్థాయి అధికారులు, వ్యాపార రంగాలకుచెందినప్రముఖలుహాజరుకానున్నారు.అంతేకాకుండా  ఇందులో ప్రసంగించే ఇతర ముఖ్య వక్తలలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్, యు.ఎస్. విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోమ్పియో, వర్జీనియా సెనటర్,సెనిట్ ఇండియా కాకస్ ,సహ అధ్యక్షుడు మార్క్ వార్నర్, ఐక్య రాజ్య సమితి యు.ఎస్. పూర్వ రాయబారి నిక్కీ హేలీ తదితరులు ఉన్నారు.   logo