శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 23:26:54

అధిక సామర్థ్యం ఉన్నకరోనా పరీక్ష సదుపాయాల ప్రారంభించనున్న ప్రధాని మోడీ

అధిక సామర్థ్యం ఉన్నకరోనా పరీక్ష సదుపాయాల  ప్రారంభించనున్న ప్రధాని మోడీ

ఢిల్లీ : అధిక ప్రవాహ సామర్థ్యం కలిగిన కోవిడ్-19 పరీక్ష సదుపాయాల ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రేపు ప్రారంభించనున్నారు. ఈ సదుపాయాలు దేశం లో పరీక్షల ను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతాయి. లక్షణాలను ముందుగానే పసిగట్టి , మహమ్మారిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టవచ్చు. అందుకోసమే సరికొత్త సాంకేతికతను ఉపయోగించి టెస్టుల సామర్త్యాన్ని పెంచేందుకు కేద్ర సర్కారు నిర్ణయించుకుంది. 

మూడు అధిక ప్రవాహ సామర్థ్యం కలిగిన పరీక్ష సదుపాయాల ను వ్యూహాత్మక రీతి న నోయిడా లోని ఐసిఎమ్ఆర్- నేషనల్ ఇనిష్టిటిట్యూట్ ఆఫ్ కేన్సర్ ప్రివెన్షన్ ఎండ్ రిసర్చ్ లోను, ముంబయి లోని ఐసిఎమ్ఆర్- నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఫార్ రిసర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్థ్ లోను , కోల్ కతా లోని ఐసిఎమ్ఆర్- నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కాలర ఎండ్ ఎన్ టెరిక్ లోను ఏర్పాటు చేశారు. ఇవి ప్రతి రోజూ 10,000 కు పైగా నమూనాల ను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగివుంటాయి.  logo