సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 15, 2020 , 17:09:07

నరేంద్ర మోడీకి నేపాల్ ప్ర‌ధాని ఫోన్

నరేంద్ర మోడీకి నేపాల్ ప్ర‌ధాని ఫోన్

ఢిల్లీ : నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి కె.పి.శ‌ర్మ ఓలి భారత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కి శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. భార‌త 74వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌తదేశ ప్ర‌జ‌ల‌కు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఐక్య‌రాజ్య స‌మితి నాన్ పెర్మ‌నెంట్ స‌భ్య‌త్వానికి ఎన్నికైనందుకు భార‌త‌దేశానికి ఆయ‌న శుభాకాంక్ష‌లు అంద‌చేశారు. కోవిడ్‌-19ని అదుపులోకి తేవ‌డానికి ప‌ర‌స్ప‌రం సంఘీభావ‌పూర్వ‌కంగా స‌హ‌క‌రించుకోవాల‌ని ఇద్ద‌రు నాయ‌కులు అంగీక‌రించారు. ఈ విష‌యంలో నేపాల్ కు భార‌త‌దేశం నిరంత‌ర మ‌ద్ద‌తు కొన‌సాగిస్తుంద‌ని నేపాల్ కు ప్ర‌ధాన‌మంత్రి హామీ ఇచ్చారు. టెలిఫోన్ కాల్ చేసినందుకు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసిన ప్ర‌ధాన‌మంత్రి .... భార‌త, నేపాల్ దేశాల మ‌ధ్య నాగ‌రిక‌‌, సాంస్కృతి కపరంగా దగ్గర పోలికలు ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. 

 


logo