సోమవారం 08 మార్చి 2021
National - Jan 26, 2021 , 09:04:43

ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

న్కూఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. జై హింద్‌’ అంటూ ఆయన తన ట్వీట్‌ చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశరాజధాని ఢిల్లీలో భద్రతా దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఐటీఓ, యమునా వంతెన తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

రాజ్‌పథ్‌లో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో భాతర సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, దేశ  సాంఘిక, ఆర్థిక ప్రగతి ప్రతిబింబించేలా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 17వ సైనిక పటాలాలు, 9 వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన పటాలాలు, కేంద్ర  పారామిలటరీ బలగాలు, 9 భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బలగాలు గణతంత్ర పరేడ్‌లో పాల్గొనున్నాయి. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo