ఆదివారం 17 జనవరి 2021
National - Nov 28, 2020 , 13:35:57

జీనోమ్‌వ్యాలీలో ప్రధాని మోదీ.. కొవిడ్‌ టీకాపై సమీక్ష

జీనోమ్‌వ్యాలీలో ప్రధాని మోదీ.. కొవిడ్‌ టీకాపై సమీక్ష

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్వేతా మొహంతితో పాటు పలువురు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీకి చేరుకున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థను సందర్శించనున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి సంస్థ తయారు చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం 2.15 గంటలకు భారత్‌ బయోటెక్‌ నుంచి బయలుదేరి.. 2.40 గంటలకు హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50గంటలకు ఇక్కడి నుంచి పూణేకు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా రాజీవ్‌ రహదారిపై హైదరాబాద్‌ - కరీంనగర్‌ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధాని ఉదయం గుజరాత్‌లోని బైడస్‌ క్యాడిలా సంస్థను ప్రధాని సందర్శించారు. క్యాడిలా సంస్థ తయారు చేస్తున్న ‘జైకోవ్‌-డీ’ కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీకి సంబంధిన ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.