బుధవారం 28 అక్టోబర్ 2020
National - Aug 16, 2020 , 16:40:02

పార్సీల‌కు ప్ర‌ధాని మోదీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

పార్సీల‌కు ప్ర‌ధాని మోదీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

ఢిల్లీ : ప‌ఆర్సీ పార్సీ నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నేడు ఆ క‌మ్యూనిటీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.  దేశానికి పార్సీ సమాజం అందించిన అత్యుత్తమ సహకారాన్ని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా ప్రశంసించారు. విస్తృత రంగాలలో తనదైన ముద్ర వేసిన పార్సీ సమాజం అద్భుత సహకారాన్ని భారత్ ఎంతో ఆదరిస్తుంద‌న్నారు. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శ్రేయస్సును తెస్తుందని ఆకాంక్షిస్తుంద‌ని మోదీ ట్వీట్ చేశారు. పార్సీలు భార‌త్‌లో ఓ చిన్న మైనార్టీ స‌మాజం. అయిన‌ప్ప‌టికీ దశాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రముఖ వ్యక్తులను అందిస్తుంద‌న్నారు. 

పార్సీ న్యూ ఇయర్‌ను నవ్రోజ్ లేదా నౌరోజ్ అని కూడా పిలుస్తారు. ఇరాన్ క్యాలెండర్ ప్రారంభానికి గుర్తుగా న‌వ్రోజ్‌ను సెల‌బ్రేట్ చేస్తారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో నవ్రోజ్ వస్తుంది. ప‌ర్షియన్ భాషలో నవ్ అంటే కొత్త అని రోజ్ అంటే రోజు అని అన‌గా కొత్త రోజు అని అర్ధం. ఈ సంప్రదాయం గత 3 వేల సంవత్సరాలుగా వ‌స్తున్న‌ట్లుగా నమ్ముతారు. దీనిని ఇరానియన్లు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ పార్సీ సమాజం పాటిస్తోంది. భారత్‌లో మహారాష్ట్ర, గుజరాత్‌లో పార్సీ జనాభా ప్రముఖంగా నివసిస్తున్నారు. logo