సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 02:33:28

నేడు సీఎంలతో ప్రధాని సమావేశం

నేడు సీఎంలతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం తొమ్మిది రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కరోనా కట్టడి చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, హర్షవర్ధన్‌, కిషన్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. logo