శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 01:10:29

టీకాలపై రాజకీయాలొద్దు: మోదీ

టీకాలపై రాజకీయాలొద్దు: మోదీ

న్యూఢిల్లీ: కరోనా టీకాలపై రాజకీయం చేస్తూ, ప్రజల్లో భయాలను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. శాస్త్రవేత్తల సూచనల మేరకే టీకాలకు అనుమతి ఇచ్చినట్టు స్పష్టంచేశారు. కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేయడంపై వస్తున్న విమర్శల మీద ఆయన ఈ మేరకు పరోక్షంగా స్పందించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌' స్ఫూర్తి ప్రజల రోజువారీ జీవితాల్లో భాగమై పోయిందని మోదీ అన్నారు. యువకులతో కూడిన భారత జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టుపై చార్రితక విజయాన్ని నమోదు చేయటాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. 

VIDEOS

logo