సోమవారం 01 జూన్ 2020
National - May 07, 2020 , 10:03:33

Vizag Gas Leak : ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి లీకైంది 'పీవీసీ' గ్యాస్‌

Vizag Gas Leak : ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి లీకైంది 'పీవీసీ' గ్యాస్‌

అమరావతి : గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పీవీసీ(పాలీవినైల్ క్లోరైడ్) గ్యాస్‌ లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు గ్రేటర్‌ విశాఖపట్టణం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన గుమ్మల ట్వీట్‌ చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైందని ఆమె తెలిపారు. ఈ గ్యాస్‌ లీకేజీ వల్ల వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. బాధితులంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. 

విశాఖపట్టణంలో బయటకు వచ్చే వారు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేదా మూతికి బట్టలు కట్టుకోవాలని జీవీఎంసీ సూచించింది. పరిశ్రమ సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. logo