గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 11:07:03

శివలింగానికి మాస్క్‌.. తాకొద్దని భక్తులకు విజ్ఞప్తి

శివలింగానికి మాస్క్‌.. తాకొద్దని భక్తులకు విజ్ఞప్తి

లక్నో : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైన విషయం విదితమే. అయితే ఓ పూజారి మాత్రం ఏకంగా శివలింగానికి మాస్క్‌ వేశారు. శివలింగాన్ని ఎవరూ తాకొద్దని భక్తులకు పూజారి విజ్ఞప్తి చేశారు. దేవుడికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారి తెలిపారు. ఈ సంఘటన యూపీ వారణాసిలోని ఓ ఆలయంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకే శివలింగానికి మాస్క్‌ వేశామని పూజారి కృష్ణ ఆనంద్‌ పాండే స్పష్టం చేశారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు కూడా మాస్క్‌లు ధరించి వస్తున్నారు.


logo
>>>>>>