షణ్ముఖ్ జస్వంత్.. కొన్ని రోజుల కింద వరకు యూట్యూబ్‌లో ఈయన వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు మాత్రమే పరిచయమైన పేరు. కానీ ఈ మధ్య జరిగిన ఓ సంఘటన ఈ కుర్రాడిని రాత్రికి రాత్రే హాట్ టాపిక్ గా మార్చేసింది. యూట్యూబ్ తన అడ్డాగా మార్చుకున్న ఈ కుర్రాడు అక్కడ సంచలనాలు సృష్టిస్తున్నాడు. యూట్యూబ్‌లో ఈయన చేసే వీడియోలు పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ట్రెండ్ అవుతున్నాయి. మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన సూర్య 6వ ఎపిసోడ్ యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది. నెం 1 ట్రెండింగ్‌లో ఉండి కేవలం 24 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ కు చేరువగా వచ్చింది.
2020లో సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్‌తో స్టార్ అయిపోయాడు షణ్ముఖ్ జస్వంత్. ప్రస్తుతం ఈయన సూర్య అనే మరో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు ఎపిసోడ్స్ విడుదలైన తర్వాత షణ్ముక్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు. దాంతో మూడో ఎపిసోడ్ కాస్త ఆలస్యంగా వచ్చింది. ఆ సంఘటన తర్వాత సూర్య వెబ్ సిరీస్ పై ఏదైనా ప్రభావం చూపిస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ సంఘటన ఈయనపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు.
పైగా సానుభూతి ఎక్కువగా పెరిగిపోయింది. మీడియా కావాలనే ఈ కుర్రాడిని హైలైట్ చేసిందని.. ఇమేజ్ పాడు చేసిందని షణ్ణునే సపోర్ట్ చేశారు అభిమానులు. ఇప్పుడు సూర్య వెబ్ సిరీస్‌కు వస్తున్న వ్యూస్ చూస్తుంటే ఈయనపై ఎంత సానుభూతి వర్కవుట్ అయిందో అర్థమవుతుంది.
తాజాగా విడుదలైన సూర్య 6వ ఎపిసోడ్ యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది. నెం 1 ట్రెండింగ్‌లో ఉండి కేవలం 24 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ కు చేరువగా వచ్చింది. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను సూర్య వెబ్ సిరీస్ సాధిస్తుంది. దానికితోడు కామెంట్స్ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ జోరు చూస్తుంటే సాఫ్ట్ వేర్ డెవలపర్ రికార్డులను పూర్తిగా తుడిచేసేలా కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైరల్ పిక్
పుకార్లపై నవ్వుకున్న హరీష్ శంకర్..ఇంతకీ అదేంటంటే..?
రామ్ చరణ్ రంగస్థలం తమిళ ట్రైలర్ రిలీజ్
శ్రీ రామ నవమికి విడుదలైన సినిమా పోస్టర్స్ ఇవే..
మరోసారి ఇద్దరు భామలతో రొమాన్స్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు
ఒకేసారి థియేటర్లో, ఆన్లైన్లో రిలీజ్ కానున్న రాధే
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్ల ట్రోల్స్..!
జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
అనిల్‌రావిపూడి కల నెలవేరబోతుందా..?