శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 12:28:40

సింహాలు గుంపుగానే కాదు.. అప్పుడ‌ప్పుడు ఇలా వ‌రుస‌గా కూడా ఉంటాయి!

సింహాలు గుంపుగానే కాదు.. అప్పుడ‌ప్పుడు ఇలా వ‌రుస‌గా కూడా ఉంటాయి!

నానా.. పందులే గుంపుగా వ‌స్తాయి. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వ‌స్తుంది అనే డైలాగ్ విన్న‌ప్పుడ‌ల్లా.. మ‌రి సింహాలెప్పుడూ సింగిల్‌గానే ఉంటాయా?  గుంపుగా అస‌లు ఉండ‌వా అన్న డౌట్ ప్ర‌తిఒక్క‌రికీ వ‌స్తుంది. అందుకు స‌మాధానంగా ఈ వీడియో ఉంటుంది. అప్పుడ‌ప్పుడూ సింహాలు కూడా గుంపుగా ఉంటాయి. కాక‌పోతే సంద‌ర్భాన్ని బ‌ట్టి ఉంటాయి. ఒక సింహానికి బాగా దాహం వేసి ఒక న‌ది ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నీళ్లు తాగుతున్న‌ది.

దానితో ఉన్న మిగ‌తా సింహాల‌కు కూడా దాహ‌మేసిన‌ట్లుంది. ఒక్కొక్క‌టిగా లైన్‌లో వ‌చ్చి మ‌రీ నీళ్లు తాగుతున్నాయి. వీటిని చూస్తుంటే ఎవ‌రో ట్రైనింగ్ ఇచ్చిన‌ట్లే ఉంది. కొంచెం గ్యాప్ కూడా ఇవ్వ‌కుండా లైన్‌గా నిల్చుని భ‌లే నీళ్లు తాగుతున్నాయి. ఈ వీడియోను నిషీత్ శ‌ర‌ణ్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్ప‌టికే ల‌క్షా 27 వేల మంది వీక్షించారు. 'వావ్‌ ఎంత అంద‌మైన దృశ్యం'. 'అమేజింగ్' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.logo