మీరు మార్కెట్లో కానీ.. వెజ్ టబుల్ మాల్స్ లో గానీ టమోటాలు కొంటున్నారా ? కేజీ 10-30 రూపాయల వరకు ఉంటోంది కదా. కానీ కోయంబత్తూరులో మాత్రం కేజీ 3 రూపాయలే . ఇది కష్టించి పండించిన రైతు ఆవేదన. లక్ష రూపాయల పెట్టుబడి పెడితే కేజీకి 3 రూపాయలు మాత్రమే వస్తున్నాయని అన్నదాత లబోదిబోమంటున్నాడు.
తమిళనాడు కోయంబత్తూరు అన్నదాతలను ఈసారి టమోటా పంట నిలువునా ముంచేసింది. ఎకరానికి 40వేల నష్టం వస్తోందని ఈ భారాన్ని ఎలా మోయాలంటూ ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం టమోటాకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.