శుక్రవారం 10 జూలై 2020
National - Jun 23, 2020 , 15:40:56

సొమ్మ‌సిల్లి ప‌డిపోయిన ప్రజ్ఞా ఠాకూర్

సొమ్మ‌సిల్లి ప‌డిపోయిన ప్రజ్ఞా ఠాకూర్

‌భోపాల్‌: భారతీయ జనతా పార్టీ నాయ‌కురాలు, భోపాల్ పార్లమెంట్‌ సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ మంగళవారం భోపాల్ బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆమె కండ్లు తిరిగి ప‌డిపోయారు. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్ప‌త్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. 

కాగా, గ‌త కొంత కాలం నుంచి ప్రజ్ఞా ఠాకూర్ ఆరోగ్యం బాగుండ‌టంలేదు. ఆదివారం అంత‌ర్జాతీయ యోగా డే సంద‌ర్బంగా కూడా భోపాల్ బీజేపీ కార్యాల‌యంలో జ‌రిగిన యోగా కార్య‌క్ర‌మంలో ప్ర‌జ్ఞ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆమె కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో వేధింపులవ‌ల్లే త‌న ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ద‌ని ఆరోపించారు. 


logo