శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 12:03:34

నేడు రాష్ట్ర‌ప‌తిని క‌ల‌వ‌నున్న విప‌క్ష నేత‌లు

నేడు రాష్ట్ర‌ప‌తిని క‌ల‌వ‌నున్న విప‌క్ష నేత‌లు

న్యూఢిల్లీ: వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ బిల్లుల‌కు సంబంధించి ప్ర‌తిప‌క్ష నేత‌లు రాష్ట్ర‌పతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఈరోజు సాయంత్రం క‌లువ‌నున్నారు. ఈమేర‌కు రాష్ట్ర‌ప‌తి కోవింద్ సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కు స‌మయం కేటాయించారు. అయితే క‌రోనా దృష్ట్యా ఐదుగురు నేత‌లు మాత్ర‌మే రావాల‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు సూచించాయి. 

వ్య‌వ‌సాయ బిల్లుల‌పై త‌మ‌కున్న అభ్యంత‌రాల‌ను వివ‌రించడానికి స‌మ‌యం కేటాయించాల‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు ప‌లువురు ప్ర‌తిప‌క్ష నేత‌లు సోమ‌వారం విజ్ఞ‌ప్తి చేశారు. కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, ఎన్సీపీ, డీఎంకే, స‌మాజ్‌వాదీ పార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఆర్జేడీ త‌దిత‌ర పార్టీలు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించాయి. దీంతో రాష్ట్ర‌ప‌తి వారికి ఈరోజు స‌మ‌యం కేటాయించారు. కాగా, బిల్లుపై సంత‌కం చేయ‌కూడ‌ద‌ని ఎన్‌డీఏ భాగ‌స్వామ్య పార్టీ శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీ అధ్య‌క్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాద‌ల్ ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తిని కోరారు. 


logo