గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 14:53:36

ఆ ప్రేమకథ విని భావోద్వేగానికి లోనైన ట్రంప్‌

ఆ ప్రేమకథ విని భావోద్వేగానికి లోనైన ట్రంప్‌

న్యూఢిల్లీ : తాజ్‌మహల్‌ సందర్శన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భావోద్వేగానికి లోనయ్యారని గైడ్‌ నితిన్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఈ పాలరాతి కట్టడాన్ని చూసిన ట్రంప్‌ దంపతులు.. నమ్మశక్యంగా లేదని అన్నట్లు ఆయన చెప్పారు. తాజ్‌మహల్‌ నిర్మాణం, దాని నిర్మాణం వెనుకాల ఉన్న అసలు కథతో పాటు షాజహాన్‌, ముంతాజ్‌ మహల్‌ ప్రేమ కథను చెప్పినప్పుడు ట్రంప్‌ భావోద్వేగానికి లోనయ్యారని గైడ్‌ తెలిపారు. తాజ్‌మహల్‌ను చూసిన ట్రంప్‌ దంపతులకు కాసేపు మాటలు రాలేదని.. ఆశ్చర్యం వ్యక్తం చేశారని నితిన్‌ కుమార్‌ చెప్పారు. తాజ్‌మహల్‌ విశేషాలను తెలుసుకునేందుకు వారు ఆసక్తి చూపారని ఆయన వెల్లడించారు. మడ్‌ ప్యాక్‌ చికిత్స గురించి మెలానియా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. 


logo