గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 21:08:39

వీర సైనికుల‌కు శిర‌సు వంచి ప్ర‌ణ‌మిల్లుతున్నా: రాష్ట్ర‌ప‌తి

వీర సైనికుల‌కు శిర‌సు వంచి ప్ర‌ణ‌మిల్లుతున్నా: రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ: లఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌ర‌ణించిన అమ‌ర జ‌వాన్ల‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. సోమవారం అర్ధ‌రాత్రి గాల్వ‌న్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య‌ జరిగిన ఘర్షణల్లో 20 మంది భార‌త జ‌వాన్లు వీరమరణం పొందారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ జ‌వాన్లు మ‌ర‌ణంపై విచారం వ్య‌క్తం చేశారు. అమరవీరుల సమున్నత త్యాగాలను ఆయన కొనియాడారు. 

దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటం కోసం అత్యున్నత త్యాగం చేసిన వీర‌ సైనికుల ధైర్యానికి సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నా అని రాష్ట్రపతి కోవింద్‌ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొన్నారు. లడఖ్‌లోని గాల్వన్‌ లోయలో నేలకొరిగిన సైనికులందరూ భారత సాయుధ దళాలు నెలకొల్పిన సంప్రదాయాలను సమున్నతంగా నిలబెట్టార‌ని కొనియాడారు. వారి కుటుంబాలకు రాష్ట్ర‌ప‌తి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


logo