శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 13:39:30

స్కూల్ విద్యార్థికి రాష్ర్ట‌ప‌తి రేసింగ్ సైకిల్ బ‌హుమ‌తి

స్కూల్ విద్యార్థికి రాష్ర్ట‌ప‌తి రేసింగ్ సైకిల్ బ‌హుమ‌తి

ఢిల్లీ : ఓ పాఠ‌శాల విద్యార్థికి రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ రేసింగ్ సైకిల్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. రిజాజ్ అనే బాలుడు ఢిల్లీలోని స‌ర్వోద‌య బాల్ విద్యాల‌యంలో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. టాప్ సైకిలిస్ట్‌గా రాణించాల‌నేది ఇత‌డి క‌ల‌. ఒక‌ప్ర‌క్క చ‌దువుతూనే మ‌రోవైపు ఘ‌జియాబాద్‌లోని తినుబండారాల దుకాణంలో గిన్నెలు క‌డిగే ప‌నిచేస్తున్నాడు. ఇత‌ని క‌ల గురించి తెలిసిన రాష్ర్ట‌ప‌తి రేసింగ్ సైకిల్‌ని కొని విద్యార్థికి బ‌హుమ‌తిగా అంద‌జేశారు.logo