శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 26, 2020 , 17:21:40

విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనిక ఆసుపత్రికి రాష్ట్రపతి విరాళం

విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనిక ఆసుపత్రికి రాష్ట్రపతి విరాళం

ఢిల్లీ : కార్గిల్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాడి, దేశం కోసం ప్రాణాత్యాగం చేసిన సైనికులకు నివాళిగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కోసం ఈ విరాళంతో రక్షణ సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించిన రోజును 'విజయ్‌ దివస్‌'గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదివారం  21వ విజయ్‌ దివస్. ‌రాష్ట్రపతి భవన్‌లో చేసే పలు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా కొంత మొత్తాన్నిపొదుపు చేశారు. ఆ మొత్తాన్ని సైనిక ఆసుపత్రికి విరాళంగా అందించారు. 

రాష్ట్రపతి భవన్‌లో చేపట్టే కొన్ని ఖర్చులను తగ్గించాలని రాష్ట్రపతి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. వేడుకల సందర్భాల్లో ఉపయోగించేందుకు 'లిమౌజిన్' కారును కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఆయన వాయిదా వేశారు. సైనిక ఆసుపత్రికి రాష్ట్రపతి ఇచ్చిన విరాళంతో 'పీఏపీఆర్‌' (పవర్డ్‌ ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ రెస్పిరేటర్‌) యూనిట్లు కొనుగోలు చేయనున్నారు. సర్వ సైన్యాధిపతిగా రాష్ట్రపతి చూపిన ఉదారత సైనిక ఆసుపత్రిలోని కరోనా విధుల్లో ఉన్న సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది.  


logo