ఆదివారం 12 జూలై 2020
National - Jul 01, 2020 , 15:03:07

ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్యకు బ‌ర్త్ డే గ్రిటింగ్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ

ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్యకు బ‌ర్త్ డే గ్రిటింగ్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు పుట్టిన రోజు ఇవాళ.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ.. ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.  సుదీర్ఘ‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని కొన‌సాగించాల‌ని ప్ర‌ధాని కాంక్షించారు. ఎన‌ర్జిటిక్ ఉప‌రాష్ట్ర‌ప‌తికి విషెస్ చెబుతున్న‌ట్లు తెలిపారు.  ట్విట్ట‌ర్‌లో స్పందించిన మోదీ.. ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌ను.. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్రేమిస్తార‌న్నారు. ఆయ‌న ఇంటెలిజెన్స్‌, వాక్ చాతుర్యం అమోఘం అని మోదీ కొనియాడారు.  రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా వెంక‌య్య‌నాయుడు అద్భుత‌మైన పాత్ర పోషిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. 

బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీకి..  వెంక‌య్య‌నాయుడు థ్యాంక్స్‌ చెప్పారు.  దేశ అభివృద్ధి కోసం క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దామ‌ని వెంక‌య్య రిప్లై ఇచ్చారు.  దేశం న‌లుమూల నుంచి వ‌స్తున్న బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ త‌న‌ను ఎంతో సంతోషానికి గురి చేశాయ‌న్నారు. ఇది చాలా విప‌త్క‌ర స‌మ‌య‌మ‌ని, అందరూ బాగున్నార‌ని అనుకుంటున్నాన‌ని, క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో అంద‌రూ భాగ‌స్వాముల‌మ‌వుదామ‌న్నారు. అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వెంక‌య్య కోరారు.  

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్‌, కేంద్ర మంత్రి అమిత్ షా.. త‌మ ట్విట్ట‌ర్ ద్వారా వెంకయ్య‌కు బ‌ర్త్‌డే గ్రిటింగ్స్ తెలిపారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చ‌వ‌ట‌పాలెంలో 1949లో వెంక‌య్య‌నాయుడు జ‌న్మించారు. క‌ర్నాట‌క నుంచి ఆయ‌న రాజ్య‌స‌భ‌కు మూడుసార్లు ఎన్నియ్యారు. 1998 నుంచి 2014 వ‌ర‌కు ఎంపీగా చేశారు.  2002లో ఆయ‌న బీజేపీ అధ్య‌క్షుడిగా చేశారు. 2014, మే 26వ తేదీన కేంద్ర ప‌ట్టణాభివృద్ధి, పార్ల‌మెంట‌రీ అఫైర్స్ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2017, ఆగ‌స్టు 5వ తేదీన ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య ఎన్నిక‌య్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo