శుక్రవారం 03 జూలై 2020
National - Feb 01, 2020 , 10:42:47

ఉరిశిక్ష‌.. విన‌య్ శ‌ర్మ అభ్య‌ర్థ‌న తిర‌స్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

ఉరిశిక్ష‌.. విన‌య్ శ‌ర్మ అభ్య‌ర్థ‌న తిర‌స్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

హైద‌రాబాద్‌:  నిర్భ‌య రేప్ కేసులో దోషిగా ఉన్న విన‌య్ శ‌ర్మ పెట్టుకున్న క్ష‌మాభిక్ష అభ్య‌ర్థ‌న‌ను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తిర‌స్క‌రించారు.  వాస్త‌వానికి నిర్భ‌య రేప్ కేసులో న‌లుగురు దోషుల‌కు ఇవాళ ఉరిశిక్ష అమ‌లు చేయాల్సి ఉన్న‌ది. కానీ ఆ దోషుల‌కు ఉరిశిక్ష‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. డెత్‌వారెంట్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.  శనివారం ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ గతంలో జారీ అయిన డెత్ వారంట్లపై స్టే విధించాలని ముగ్గురు దోషులు పవన్, వినయ్, అక్షయ్ గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా శుక్రవారం విచారణ చేపట్టారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం వినయ్ దాఖలు చేసిన అభ్యర్థన పెండింగ్‌లో ఉన్నదని దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. ఒకే కేసుకు సంబంధించి ఒకరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు మిగతా వారికి ఉరిశిక్ష అమలు చేయకూడదన్న నిబంధనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలని కోర్టును కోరారు.


logo