సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 12:08:47

మంత్రి క‌మ‌ల్ రాణి వ‌రుణ్ మృతిప‌ట్ల రాష్ర్ట‌ప‌తి సంతాపం

మంత్రి క‌మ‌ల్ రాణి వ‌రుణ్ మృతిప‌ట్ల రాష్ర్ట‌ప‌తి సంతాపం

ఢిల్లీ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట సాంకేతిక విద్యాశాఖ మంత్రి క‌మ‌ల్ రాణి వ‌రుణ్ క‌రోనాతో మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. ఆమె మ‌ర‌ణం ప‌ట్ల రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా రాష్ర్ట‌ప‌తి స్పందిస్తూ... ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి శ్రీమతి కమల్ రాణి వరుణ్ అకాల మరణం బాదించింద‌న్నారు. అట్టడుగు ప్రజలకు సేవ చేసి ఎన్నో మ‌న్న‌ల‌ను పొందార‌న్నారు. లోక్‌సభలో రెండుసార్లు ఎంపీగా కూడా పనిచేశార‌న్నారు. ఆమె కుటుంబానికి, అనుచరులకు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. 

గ‌త‌ కొంత‌కాలంగా క‌రోనా చికిత్స పొందుతున్న ‌కమ‌ల్ రాణి ఆదివారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు క‌న్నుమూశారని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జూలై 18న ఆమె క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో అప్ప‌టి నుంచి సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు.


logo