బుధవారం 21 అక్టోబర్ 2020
National - Aug 14, 2020 , 20:15:36

84 శౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం

 84 శౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం

ఢిల్లీ : భారత రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతి అయిన రామ్‌నాథ్‌ కోవింద్‌, సాయుధ, పారామిలిటరీ దళాల సిబ్బందికి ప్రదానం చేసే 84 శౌర్య పురస్కారాలు, ఇతర గౌరవాలను ఆమోదించారు. వీటిలో ఒక కీర్తి చక్ర, తొమ్మిది శౌర్య చక్ర, ఐదు బార్‌ టు సేన పతకాలు (శౌర్య), 60 సేన పతకాలు (శౌర్య), నాలుగు నవ సేన పతకాలు (శౌర్య), ఐదు వాయు సేన పతకాలు (శౌర్య) ఉన్నాయి. వివిధ సైనిక ఆపరేషన్లలో వీరోచిత పాత్ర పోషించిన 19 మంది సైనిక సిబ్బందికి 'మెన్షన్‌ ఇన్ డిస్పాచెస్‌' పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 'ఆపరేషన్‌ మేఘదూత్‌', 'ఆపరేషన్‌ రక్షక్‌'లో పాల్గొని వీరమరణం పొందిన 8 మంది సైనికుల పేర్లు కూడా 'మెన్షన్‌ ఇన్ డిస్పాచెస్‌' పురస్కారాల జాబితాలో ఉన్నాయి.


logo