శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 10:19:46

ప్ర‌ధాని మోదీకి రాష్ర్ట‌ప‌తి, ఉప‌రాష్ర్ట‌ప‌తి శుభాకాంక్ష‌లు

ప్ర‌ధాని మోదీకి రాష్ర్ట‌ప‌తి, ఉప‌రాష్ర్ట‌ప‌తి శుభాకాంక్ష‌లు

ఢిల్లీ : ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోదీకి రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్య‌నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌ధాని మోదీ 70వ జ‌న్మ‌దినం నేడు. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట‌ప‌తి, ఉప‌రాష్ర్ట‌ప‌తి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. భ‌గ‌వంతుడు మిమ్మ‌ల్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త‌దేశ జీవ‌న విలువ‌లు పాటిస్తూ, ప్ర‌జాస్వామ్య సాంప్ర‌దాయ ఆద‌ర్శాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ దేశాన్ని అంత‌ర్జాతీయంగా ఉన్న‌త‌స్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భరతతో కూడిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం అన్నారు.logo