గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 18:47:42

రాష్ట్రపతి కోవింద్‌ మధ్యప్రదేశ్‌ పర్యటన రద్దు

రాష్ట్రపతి కోవింద్‌ మధ్యప్రదేశ్‌ పర్యటన రద్దు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మధ్యప్రదేశ్‌ పర్యటన రద్దు అయింది. ఈ నెల 20, 21 తేదీల్లో జబల్‌పూర్‌లో రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండే. మధ్యప్రదేశ్‌ పర్యటన రద్దుపై రాష్ట్రపతి భవన్‌ ఓ లేఖ విడుదల చేసింది. జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతిని ఆహ్వానించారు. అనివార్య పరిస్థితుల నేపథ్యంలో రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరు కాలేకపోతున్నట్లు లేఖలో వెల్లడించారు. మార్చి 20, 21 తేదీల్లో రాష్ట్రపతి జబల్‌పూర్‌ పర్యటన రద్దు అయినట్లు లేఖలో పేర్కొన్నారు. 


logo