సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 12:17:54

అసోం, బిహార్‌, యూపీల‌కు స‌హాయ సామాగ్రి పంపిణీ

అసోం, బిహార్‌, యూపీల‌కు స‌హాయ సామాగ్రి పంపిణీ

ఢిల్లీ : ఇటీవ‌లి వ‌ర‌ద‌లు, కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్ర ప్ర‌భావానికి గురైన అసోం, బిహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల‌కు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేడు స‌హాయ సామాగ్రిని పంపించారు. స‌హాయ సామాగ్రితో కూడిన తొమ్మిది ట్ర‌క్కుల‌ను రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్‌లో రామ్‌నాథ్ కోవింద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, ఇండియ‌న్ రెడ్‌క్రాస్ అధికారులు పాల్గొన్నారు.


logo