బుధవారం 08 జూలై 2020
National - Jun 27, 2020 , 09:07:01

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుల నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్‌ 24న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.  

దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1540 సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకులతోపాటు 1482 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో సుమారు 8.6 కోట్ల ఖాతాదారులకు సంబంధించిన రూ.4.84 లక్షల కోట్ల డబ్బు ఉన్నది. కొన్ని నెలల క్రితం పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ)లో సంక్షోభం తలెత్తింది. దీంతో కోఆపరేటివ్‌ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకువచ్చే బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫ్రిబవరిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ, కరోనా కేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దీంతో తాజాగా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది.


logo