శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 21:41:33

వారంలో దేశీయ విమాన కార్యకలాపాలు

వారంలో దేశీయ విమాన కార్యకలాపాలు

న్యూఢిల్లీ: వారం రోజుల్లో దేశీయ విమాన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి  తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా గతనెల 24 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దేశంలోని గ్రీన్‌ జోన్ల మధ్య విమానాల నిర్వహణపై త్వరలోనే ఫైనల్‌ నిర్ణయం తీసుకోంటామని చెప్పారు. దేశీయంగా పౌర  విమానయానాన్ని ప్రారంభించిన తర్వాత  దానికి రెస్క్యూ అని పిలువలేమని, వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత అందరూ ప్రయాణించే వీలుంటుందని ఆయన వెల్లడించారు.


logo