శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 12:46:59

భూమిపూజ కోసం 1,11,000 ల‌డ్డూలు!

భూమిపూజ కోసం 1,11,000 ల‌డ్డూలు!

ల‌క్నో: ఆయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం కోసం మ‌రో ఐదు రోజుల్లో భూమిపూజ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ మేర‌కు మ‌ని రాందాస్ చావ్నీలో ల‌డ్డూల త‌యారీ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. కార్య‌క్ర‌మంలో పంచిపెట్ట‌డం కోసం మొత్తం 1.11 ల‌క్ష‌ల ల‌డ్డూలు త‌యారు చేస్తున్నామ‌ని అక్క‌డ ప‌నిచేస్తున్న‌వారు తెలిపారు. 

రామాల‌యం నిర్మాణం కోసం అయోధ్య‌లో ఆగ‌స్టు 5న భూమిపూజ చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి   ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హాజ‌రుకానున్నారు. ప్ర‌ధాని చేతుల‌మీదుగానే శంకుస్థాప‌న జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఆయోధ్య‌లో భారీ బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు.                                   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo